రుద్రమదేవి విడుదలై ఐదేళ్లయిపోయింది. ఇప్పటి వరకూ గుణశేఖర్ తదుపరి సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. అయితే చాలాకాలంగా ఆయన` హిరణ్య కశ్యప` ప్రాజెక్టులో తలమునకలై ఉన్నారు. రానా కథానాయకుడిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అందుకోసం భారీ ఎత్తున ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఓ హాలీవుడ్ సంస్థ కూడా ఈ ప్రాజెక్టులో భాగం పంచుకుంది. ఇప్పుడు ఆ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈరోజు రాత్రి 7 గంటల 11 నిమిషాలకు ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్ డేట్ ఇవ్వబోతోంది చిత్రబృందం. రానా మినహాయిస్తే మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవ్వరూ ఖరారు కాలేదు. వాటికి సంబంధించిన అప్ డేట్ ఈరోజు ఇచ్చే అవకాశాలున్నాయి. 2021 లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది.