మల్టీస్టారర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్స్ గా నిలిచాడు దగ్గుబాటి రానా. `బాహుబలి` తరవాత.. పవన్ కల్యాణ్ తో `అప్పయ్యయుమ్ కోషియమ్` రీమేక్ లో నటిస్తున్నాడు. ఇప్పుడు మరో మల్టీస్టారర్‌కి ఓకే చెప్పాడు. విశ్వక్ సేన్ తో కలిసి రానా ఓ సినిమా చేయబోతున్నాడని టాక్. కథ ఇప్పటికే సిద్ధమైపోయింది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. విశ్వక్ ఇప్పుడు ఫల్ బిజీ. కార్తికేయతో ఓ మల్టీస్టారర్ చేస్తున్నాడు విశ్వక్. ఇప్పుడు రానాతో కలసి నటించడానికి కూడా రెడీ అయ్యాడు. 2021 ప్రధమార్థంలో ఈసినిమా పట్టాలెక్కే ఛాన్సుంది. దర్శకుడు, ఇతర వివరాలూ.. త్వరలో వెల్లడవుతాయి. రానా `ఆరణ్య` త్వరలోనే విడుదల అవుతుంది. మరోవైపు `అప్పయ్యయుమ్ కోషియమ్` రీమేక్ పై సన్నాహాలు జరుగుతున్నాయి. రానా, వెంకటేష్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కించాలని సురేష్‌బాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చూస్తుంటే రానా 2021 క్యాలెండర్ ఫుల్ బిజీ అయిపోయినట్టు కనిపిస్తోంది.