తెలుగు యంగ్ హీరోల్లో రానా రూటే సపరేటు. ఎవరూ టచ్ చెయ్యనటువంటి డిఫరెంట్ సబ్జక్ట్స్ టచ్ చేస్తాడు. కథకు పర్ఫెక్ట్ టచప్ ఇవ్వడం కోసం ఎంత కష్టమైనా పడతాడు. అడవిలోకి వెళ్లి ఏనుగులతో ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ స్పెండ్ చేయడానికీ సిద్ధమవుతున్నాడు. రానా తెలుగు, హిందీ భాషల్లో ‘హాథీ మేరే సాథీ’ సినిమా చేస్తున్నాడు. సినిమా పేరులో ఏనుగు (హాథీ) ఉన్నప్పుడు కథలో, షూటింగులో లేకుండా ఉంటాయా? చెప్పండి! ఏనుగులకు, మనుషులకు మధ్య ఫ్రెండ్షిప్ బేస్డ్ స్టోరీతో రూపొందుతోన్న సినిమా. అందుకని షూటింగ్ స్టార్ట్ కావడానికి కొన్ని రోజుల ముందు రానా ఫారెస్ట్ టూర్ ప్లాన్ చేశాడు. పదిహేను నుంచి ఇరవై రోజులు అడవిలో ఏనుగులతో మమేకం కావడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. 18 నుంచి 20 ఏనుగుల మధ్య థాయిలాండ్ అడవుల్లో ఈ సినిమా షూటింగ్ చేయనున్నారు. ఈ నెలలో షూటింగ్ ప్రారంభించనున్నారు. రానా ఏప్రిల్లో టీంతో జాయిన్ కానున్నారు. దీపావళికి సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.