మలయాళంలో ఘన విజయం సాధించిన `అయ్యప్పయుమ్ కోషియమ్`ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ హీరో. సాగర్ చంద్ర దర్శకుడు. ఈ సినిమాలో మరో కథానాయకుడిగా దగ్గుబాటి రానా కనిపిస్తాడని ప్రచారం జరిగింది. అయితే చిత్రబృందం అపీషియల్ గా ప్రకటించలేదు. దాంతో రానా ఉంటాడా? మరో హీరో వస్తాడా? అనే అనుమనాలు తలెత్తాయి. వాటికి చెక్ పెట్టింది చిత్రబృందం.
ఈ రీమేక్ కి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన ఈరోజు ఉదయం10 గంటల 17 నిమిషాలకు వస్తుందని చిత్రబృందం ముందే చెప్పింది. దాని ప్రకారమే.. ఓ అప్ డేట్ ఇచ్చింది. ఈ రీమేక్ లో రానా ఎంట్రీ ఇచ్చాడంటూ.. అధికారికంగా ఖరారు చేసింది. ఈరోజు నుంచే ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కబోతోంది. తమన్ సంగీతం అందిస్తారు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి మాటలు సమకూర్చారు. అందుకోసం ఆయనకు 10 కోట్ల పారితోషికంతో పాటు లాభాలలో 50 శాతం వాటా ఇవ్వబోతున్నట్టు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.