ఓటీటీ వేదికలపైపు స్టార్ల చూపు పడింది. వెబ్ సిరీస్, టాక్ షో.. ఇలా ఏదైనా సరే, చేయడానికి రెడీగా ఉన్నారు. అందు నిమిత్తం వాళ్లకు భారీ పారితోషికాలూ దక్కుతున్నాయి. ఇటీవల `ఆహా` కోసం సమంత సామ్ – జామ్ మొదలెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రానా వంతు వచ్చింది. రానా కూడా ఓ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కోసం రియాలిటీ షో ప్లాన్ చేస్తున్నాడట. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఉండబోతోందని సమాచారం. ఈ షోలోనూ.. సెలబ్రెటీలే కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తయ్యింది. ఇది ఆహా కోసమా? లేదంటే.. మరో ఫ్లాట్ ఫామ్ కోసమా? అనేది తెలియాల్సివుంది. అతి త్వరలోనే ఈ రియాలిటీ షో కి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన రానుంది. ఇప్పటికే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు రానా. కొత్త ప్రాజెక్టుల్ని ఒప్పుకోవడానికి కాల్షీట్లు అంగీకరించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఈ షోకి సమయం కేటాయించాడు రానా.