రానాకి లెక్కల సబ్జెక్ట్ అంటే భయం. ఆయన పది పరీక్ష లెక్కల మూలానే తప్పారు. లెక్కలన్నా, లెక్కలు మాస్టారన్నా రానాకి ఒక వణుకులాంటి ఫీలింగ్. ఈ విషయాన్ని స్వయంగా రానానే ’35-చిన్న కథ కాదు’ టీజర్ ఈవెంట్ లో చెప్పారు. ఆయన నిర్మాతగా వస్తున్న సినిమా ఇది. స్కూలింగ్ నేపధ్యంలో సాగే కథ.
ఈ కథ గురించి రానా మాట్లాడుతూ.. స్కూల్ లో వున్నప్పుడు 35 అనేది నాకు పెద్ద పర్వతం లాంటింది. లెక్కల్లో 35 మార్కులు రాకే పది తప్పాను. నందు ఈ కథ చెప్పినపుడు నాకు నేను గుర్తుకు వచ్చాను, మా అమ్మ గుర్తుకొచ్చింది. నా కోసం మా అమ్మపడిన కష్టం గుర్తుకు వచ్చింది. ఇది అందరూ కనెక్ట్ అయ్యే కథ. ఫీల్ గుడ్ మూవీ. మంచి సినిమాగా నిలబడిపోతుంది’ అన్నారు. ఆగస్ట్ 15న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.