మలయాళ రీమేక్ `అయ్యప్పయునుం కోషియమ్` మంచి స్వింగ్ లో సాగుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. పవన్ కల్యాణ్ సెట్లోకి వచ్చాడు. అందుకు సంబంధించిన మేకింగ్ వీడియోని సైతం చిత్రబృందం విడుదల చేసింది. ఓ యాక్షన్ సీన్తో పవన్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఇప్పుడు రానా కూడా వచ్చేశాడు. ఈరోజునుంచే రానా సెట్లోకి అడుగుపెట్టాడు. ఈ షెడ్యూల్ అంతా పవన్ – రానాలపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో ఓ ప్రత్యేకమైన సెట్ వేశారు. అందులోనే సింహభాగం షూటింగ్ జరగనుంది. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. తమన్ సంగీత దర్శకుడు. ఈ యేడాదే ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తారు.