రానా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వరుస సినిమాలపై సంతకాలు చేస్తున్నాడు. రానా కొత్త చిత్రం `అరణ్య` ఈవారమే విడుదల అవుతోంది. మరోవైపు `విరాటపర్వం` సిద్దంగా ఉంది. ఇప్పుడు 14 రీల్స్ లో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అనిల్ సుంకర, రామ్ ఆచంట నిర్మాతలు. ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కానున్నాడు. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రానా ఇప్పుడు వైవిధ్యభరితమైన కథలకే ఓకే చెబుతున్నాడు. రొటీన్, రెగ్యులర్ మాస్ యాక్షన్ కథలు చేయడం లేదు. అయితే ఈ కథలో కమర్షియల్ అంశాలు మెండుగా ఉండబోతున్నాయట. మాస్కి నచ్చే పాత్రలో రానా కనిపించబోతున్నాడని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.