రానా చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. ‘హాథీ మేరీ సాథీ’, ‘1945’ చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ రెండు సినిమాలపై ఇప్పుడు కేరళ వరదల ఎఫెక్ట్ పడింది. కేరళ వరదల వల్ల ఈ రెండు సినిమాలూ ఆగిపోయాయి. ‘1945’, `హాథీ మేరీ సాథీ` ఇవి రెండూ కేరళ నేపథ్యంలో సాగే కథలే. కేరళ అడవుల్లో `హాథీ మేరీ సాథీ` తెరకెక్కిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల… కేరళ మొత్తం నీటమునిగిపోయింది. అక్కడ జన జీవనానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇలాంటి దశలో షూటింగ్ ఎలా సాగుతుంది? అందుకే ఎక్కడి షూటింగులు అక్కడ ఆగిపోయాయి. వాటిలో రానా సినిమాలు కూడా ఉన్నాయి. కేరళ లోని పరిస్థితులు చెక్కబడడానికి కనీసం రెండు నెలల సమయం అయినా పడుతుంది. ఈలోగా ఈ రెండు సినిమాలూ సెట్స్‌పైకి వెళ్లే సూచనలు కనిపించడం లేదు. ఈలోగా… ‘ఎన్టీఆర్’ బయోపిక్‌పై దృష్టి పెట్టనున్నాడు రానా. ప్రస్తుతం ‘ఎన్టీఆర్’ బయోపిక్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు రానా. వీలైనంత త్వరగా తన పార్ట్ ముగించాలని దర్శకుడు క్రిష్ కూడా భావిస్తున్నాడు. ”కేరళ వర్షాల వల్ల నా సినిమాలు ఆగిపోయాయి. మరేం ఫర్లేదు.. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నా కదా. ‘నేనే రాజు నేనే మంత్రి ‘ తరవాత నా నుంచి వచ్చే సినిమా ఏదైనా ఉందీ అంటే అది ఎన్టీఆర్ బయోపిక్ నే” అని చెప్పుకొచ్చాడు రానా.