బాబాయ్ అబ్బాయ్ వెంకటేశ్, రానా తండ్రి కొడుకులుగా నటిస్తున్న వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. నెట్‌ఫ్లిక్స్ వేదికగా మార్చి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ‘రానా నాయుడు’ టీమ్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఇది తండ్రి కొడుకుల యుద్ధం . రానా నాయుడు (రానా) బాలీవుడ్ సెలబ్రిటీ ఫిక్సర్. అతనికి తిరుగులేదు. అయితే నాగ నాయుడు (వెంకటేష్) రూపంలో అతనకి సవాల్ ఎదురౌతుంది. నాగ నాయుడు ఎవరో గారు స్వయంగా రానా నాయుడి తండ్రి. వీరి మధ్య గొడవలకు కారణం ఏమిటి ? వీరి పోరాటం దేని కోసం ? చివరికి ఎవరు గెలిచారనేది కథాంశం.
ట్రైలర్ ఆసక్తికరంగా వుంది. ముఖ్యంగా వెంకటేష్ లుక్, గెటప్ ఫ్రెష్ గా వున్నాయి. ఆయన ఇలాంటి పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి. రానా గ్రేస్ ఫుల్ గా కనిపించాడు. ఇద్దరూ పోటిపడి నటించారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ప్రియా బెనర్జీ, ఆశిష్ విద్యార్థి లాంటి తారాగణం వుంది. పాపులర్ అమెరికన్ సిరీస్ రే డోనోవన్ కు ఎడాప్ట్టేషన్ ఇది . ఇండియా వెర్సన్ ని కరణ్ అన్షుమాన్ రూపొందించారు. ఈ సిరీస్‌కి కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్ వర్మ కలసి దర్శకత్వం వహించారు.