నవదీప్ కొత్త అవతారంలో కనిపించనున్న సినిమా లవ్ మౌళి. ఈ శుక్రవారం విడుదల అవుతోంది. అవనీంద్ర దర్శకత్వం వహించారు. ఇది ఆయనకు తొలి సినిమా. ఈ సినిమాలో ఏకంగా 42 ముద్దు సన్నివేశాలున్నాయని, హాట్ సీన్లకు కొదవ లేదని ప్రచారం జరుగుతోంది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ లలో ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి. వాటికి ఆదరణ బాగుంది. అసలు రిజల్ట్ ఏమిటో రేపు తెలియాలి.
అయితే ఈసినిమాలో ఓ సర్ప్రైజ్ పాత్రలో మెరిశాడు దగ్గుబాటి రానా. అఘోరాగా కథ గమనాన్ని మార్చే పాత్రలో కాసేపు కనిపించి మాయం అయ్యాడు. రానా స్క్రీన్ ప్రజెన్స్ షాక్ ఇచ్చేలా ఉందని ప్రీమియర్లు చూసినవాళ్లు చెబుతున్నారు. అసలు కనిపిస్తోంది రానానేనా, అని ఆశ్చర్యపోయేలా మేకొవర్ సాగిందట. నవదీప్కు, రానాకూ మంచి అనుబంధం ఉంది. ఇద్దరూ మంచి స్నేహితులు. ఆ అనుబంధంతోనే నవదీప్ అడగ్గానే ఈ పాత్ర చేయడానికి ఒప్పుకొన్నాడు రానా. మరి రానా ఎంట్రీ ఈ సినిమాకు ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.