‘నేనే రాజు – నేనే మంత్రి’తో రానాకు తొలిసారిగా సోలో హిట్ ఇచ్చాడు రానా. ఆసినిమాతోనే తేజ కూడా మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఆ వెంటనే రానాతోనే మరో సినిమా కూడా ప్రకటించారు. పేరు కూడా `రాక్షస రాజు రావణాసురుడు` అని పెట్టారు. అయితే… ఈ సినిమా ఎప్పటికీ పట్టాలెక్కలేదు. మధ్యలో గోపీచంద్ తో అనుకున్న సినిమా కూడా ఆగిపోయింది. అలా.. తేజ ప్రాజెక్టులన్నీ వరుసగా పక్కకు వెళ్లిపోయాయి. ఇప్పుడు సురేష్‌బాబు తనయుడు అభిరామ్ ని హీరోగా పెట్టి ఓ సినిమా తీస్తున్నాడాయన.
అయితే రానాతో తేజ సినిమా ఉంటుందట. అభిరామ్ తో సినిమా పూర్తయిన వెంటనే.. `రాక్షస రాజు.. రావణాసురుడు` సినిమాని పట్టాలెక్కిస్తార్ట. ఈ విషయాన్ని తేజనే తెలిపారు. `రాక్షస రాజు..` స్క్రిప్టు ఎప్పుడో రెడీ అయిపోయింది. దానికి.. సురేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. రానాకి అనారోగ్య సమస్యలు రావడం, ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల, ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. 2022లోనే.. తేజ – రానాల సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.