చేతిలో హిట్లు లేకపోయినా అవకాశాల్ని మాత్రం బాగానే రాబట్టుకుంటున్నాడు రాజ్ తరుణ్. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఓ క్రేజీ ప్రాజెక్టులోనూ కనిపించబోతున్నాడని టాక్. అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. అందులో రాజ్ తరుణ్ హీరో. వీరిద్దరి కాంబినేషన్లో ఇది వరకు `లవర్` సినిమా వచ్చింది. అది ఫ్లాప్. అయినా వీరిద్దరూ మరోసారి కలసి పనిచేయడానికి ముందుకొచ్చారు. అయితే ఈ చిత్రానికి రానా నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఇప్పటికే కథ రెడీ అయిపోయిందట. రానాకి ఈ కథ బాగా నచ్చిందని, రాజ్ తరుణ్‌ని తీసుకోమని రానానే సలహా ఇచ్చాడని సమాచారం. సురేష్ ప్రొడక్షన్లో ఇప్పుడు చిన్న సినిమాలు విరివిగా వస్తున్నాయి. కాన్సెప్ట్ బాగుంటే – తక్కువ బడ్జెట్లో్ సినిమా తీసి, దానికి భారీ ప్రచారం కల్పించి వ్యాపారం చేసుకుంటున్నారు. ఆ కోవలోనే ఈ సినిమా కూడా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.