హైదరాబాద్: అన్న రానా రీల్ లైఫ్‌లో ఫైటింగ్స్ చేస్తే, తానేం తక్కువ తినలేదంటూ రియల్ లైఫ్‌లో ఫైట్స్ చేస్తున్నాడు అతని తమ్ముడు అభిరామ్. జుబ్లీ హిల్స్‌లో జరిగిన ఒక గొడవలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న ఇద్దరు అమెరికన్ దేశస్థులపై దాడి చేశాడు.
అభిరామ్ శనివారం రాత్రి జుబ్లీ హిల్స్నుంచి బంజారా హిల్స్ వైపు వెళుతుండగా, జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో అతని కారును వెనకనుంచి ఒక బైక్ రాసుకున్నట్లు గమనించాడు. ఆ బైక్‌ను ఛేజ్ చేశాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత దానిని నడుపుతున్న వ్యక్తులను నిలవరించాడు. వారిపై దాడి చేశాడు. ఆ బైక్ మీద ఉన్న వారు మార్వాన్, జిల్స్గా తెలిసింది. ఈ గొడవలో వారికి గాయాలయ్యాయి. వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి అభిరామ్‌పై కేసు నమోదు చేశారు. మరోవైపు అభిరామ్ కూడా తన కారును నష్టపరిచారంటూ కేసు పెట్టాడు. పోలీసులు న్యూసెన్స్ కేసుగా నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విదేశీయులు కొండాపూర్‌లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం.
అభిరామ్ గొడవల్లో ఇరుక్కోవటం ఇది మొదటిసారి కాదు. కొంతకాలం క్రితం తమ ఇంటి సమీపంలో జరుగుతున్న ఒక నిర్మాణం విషయంలో రవితేజ అనే ఇంజనీర్తోకూడా గొడవపడి అతనిపై దాడి చేశాడు. ఆ సమయంలో పోలీసులు అభిరామ్‌పై ఐపీసీ 447, 223, 342, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసు ఏమయిందో ఎవరికీ తెలియదు. ఆ కేసు సందర్భంగా తమ కుమారుడిది తప్పేమీ లేదని సురేష్ బాబు చెప్పారు.