2018 బిగ్గెస్ట్ హిట్ గా ఇప్పటికి రికార్డు సృష్టించిన రంగస్థలం సినిమా హండ్రెడ్ డేస్ రన్ ను ఈ నెల 8 తో పూర్తి చేసుకుంటోంది. దాదాపు 15 సెంటర్లలకు పైగా వంద రోజులు ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా ఆంధ్ర, నైజాంలోని ప్రతి జిల్లా నుంచి ఎగ్జిబిటర్లు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరినీ ఆహ్వానించి మాంచి విందు ఏర్పాటు చేస్తోంది మైత్రీ మూవీస్ సంస్థ.
యూనిట్ సభ్యులందరూ హాజరయ్యే ఈ హోమ్లీ ఫంక్షన్ లో చాలా ఖరీదుతో తయారుచేయించిన మెమెంటోలను సినిమాకు పని చేసిన వారికి, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు అందించబోతున్నారు. ప్రస్తుతానికి అయితే కేవలం యూనిట్ సభ్యులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. మరి మెగాస్టార్ చిరంజీవి వస్తారా? లేదా? అన్నది తెలియాల్సి వుంది.
సినిమా హండ్రెడ్ డెస్ విజయవంతంగా ప్రదర్శితమైన సందర్భంగా మీడియాకు కూడా ఇదే సందర్భంగా మాంచి విందు, కాక్ టైల్ పార్టీ అరేంజ్ చేయడం విశేషం.
ఏమైనా రంగస్థలం ఈ విధంగా బాహుబలి కన్నా బెటర్ అనిపించుకుంది. అంత సూపర్ హిట్ అయినా బాహుబలి హడావుడి చేసిందే లేదు.