రేపు (శుక్రవారం) రంగ స్థలం నుంచి ఫస్ట్ లుక్ రాబోతోందని చిత్రబృందం ప్రకటించింది. ఓ పోస్టర్ని కూడా విడుదల చేసింది. సాయింత్రం 5.30 లకు ఈ ఫస్ట్ లుక్ ఉండబోతోందని టైమ్‌తో సహా చెప్పింది. రంగస్థలం నుంచి ఇప్పటి వరకూ ఒక్క సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా రాకపోవడంతో నిరాశ పడ్డ అభిమానులు ఈ వార్తతో కాస్త హుషారు తెచ్చుకున్నారు. అంతలోనే చిన్న మార్పు. ఫస్ట్ లుక్‌ని 9 న (శనివారం) 9 గంటలకు విడుదల చేస్తామని కాస్త సవరించింది. ఈ సవరణ వెనుక ఉన్న వ్యక్తి సుకుమార్. ఆయనేమో మిస్టర్ పర్ఫెక్షనిస్టు. ఓ పట్టాన ఏదీ నచ్చదు. ఇప్పటికే రెడీ చేసిన ఫస్ట్ లుక్ ఆయనకు నచ్చలేదని, హడావుడిగా మరో లుక్ బయటకు తీసుకొస్తున్నారని, అందుకే టైమ్ తీసుకున్నారని సమాచారం. పైగా శుక్రవారం కంటే శనివారమే ముహూర్త బలం కూడా బాగుందని సమాచారం. సో.. రంగ స్థలం ఫస్ట్ లుక్ చెప్పిన సమయానికి రాదు. ఈ నిరీక్షణను ఓ రోజు పొడిగించాల్సిందే.