సుకుమార్ సినిమాలంటే ఏదో పూనకం వచ్చినట్టు మ్యూజిక్ కొట్టే దేవిశ్రీ ప్రసాద్ ఏమాత్రం తగ్గడం లేదు. రామ్ చరణ్ ‘రంగస్థలం’కు చితకొట్టుడు కొడుతున్నాడు. రీసెంట్గా దేవి సంగీతమందించిన సినిమాల్లో పాటలకు ఇప్పటివరకూ ఈ సినిమాలో విడుదలైన పాటలకు చాలా డిఫరెన్స్ వుంది. పల్లెటూరి నేపథ్యం, 80వ దశకం అనగానే ఆటోమేటిట్గా కొత్త ఫీల్ వచ్చింది. దానికి తగ్గట్టు దేవి ఇరగదీస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘ఎంత సక్కగున్నావే’, ‘రంగ రంగ రంగ స్థలాన’ పాటలు ఎంత హిట్టయ్యాయో తెలిసిందే. ఈలోపు మూడో పాటను విడుదల చేశారు. ‘రంగమ్మా… మంగమ్మా…’ అంటూ సాగే ఈ పాట ఇరుగుపొరుగు అమ్మాయిలతో తనను పట్టించుకోని ప్రియుడు గురించి చెబుతూ రామలక్ష్మి పాడుకునే పాట. ఇందులో రామలక్ష్మిగా సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. రామలక్ష్మి ప్రియుడు చిట్టిబాబుగా రామ్ చరణ్ నటిస్తున్నాడు. మహిళా దినోత్సవం సందర్భంగా పాటను విడుదల చేశారు. యధావిధిగా చంద్రబోస్ సాహిత్యంలో పల్లె పదాలు దొర్లాయి. అమ్మాయి అలిగితే ఎలా వుంటుందో కళ్ళకు కట్టినట్టు రాశాడు. మనస్వి వాయిస్ బాగుంది. ఇదీ ఇన్స్టంట్ ఛార్ట్బస్టర్. అమ్మాయిలందరూ ఈ పాట పాడుకుంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.