రంగస్థలం హిట్లో ఇటు రామ్‌చరణ్‌లోనూ, ఇటు సుకుమార్లోనూ కొత్త జోష్ కనిపిస్తోంది. ఈ సినిమా వీరిద్దరికీ చాలా విధాలుగా మేలు చేసింది. చరణ్, సుక్కులకు కొత్తదారులు, కొత్త విజయాల్ని అందించింది. రామ్‌చరణ్‌కి మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ విషయంలో మరో మాటకు తావులేదు. బీ,సీల్లో చరణ్ సినిమాలకు మంచి వసూళ్లు వస్తాయి.కానీ ఓవర్సీస్లో మాత్రం చరణ్ ఏమాత్రం మెప్పించలేకపోయాడు. కనీసం నానికి ఉన్న మార్కెట్ కూడా చరణ్‌కి లేదక్కడ. టాప్ 5 సినిమాల్లో చరణ్‌కి చోటే లేదు. ఆ లోటు… ‘రంగస్థలం’ తీర్చేసింది. ఆల్ టైమ్ టాప్ 5 చిత్రాల జాబితాలో.. రంగస్థలంకి చోటు దక్కడం ఖాయం. టోటల్ రన్ ముగిసేసరికి టాప్ 2లో కూర్చున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అలా… ఓవర్సీస్లో చరణ్ మార్కెట్ ఈ సినిమాతో రెక్కలు విప్పుకుంది.
ఇక సుకుమార్ విషయానికొద్దాం. సుక్కు సినిమాలు ఓవర్సీస్లో ఎప్పుడూ బాగా ఆడతాయి. కానీ… బీసీల్లో అంతంత మాత్రమే. ఆ లెక్కలు, ఆ ఫార్ములాలూ ఎవరికీ అర్థం కావు. దాంతో సినిమాకి అటూ ఇటుగా టాక్ వస్తే… బీసీల్లో సుక్కు సినిమాలకు వసూళ్లు అమాంతం పడిపోతాయి. సుక్కు హిట్ సినిమాలకు సైతం వసూళ్లు తక్కువ రావడానికి కారణం.. సుక్కుకి బీ,సీల్లో ఎక్కకపోవడమే. ఇప్పుడు రంగస్థలం.. ఆ హద్దుల్ని చెరిపేసింది. మాస్‌కి ఈ సినిమా విపరీతంగా నచ్చుతోంది. అలా… బీ,సీల్లో సుకుమార్ పట్టు సాధించగలిగాడు.