గోదావరి నేపథ్యంలో పక్కా పల్లెటూరి కథతో రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా ‘రంగస్థలం’. తెలుగులో శుక్రవారం విడుదలవుతోంది. తమిళంలో ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల చేయాలనుకుంటున్నారు. నిజానికి, ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్‌గా తీయాలనుకున్నామని, కాని కుదరలేదని చరణ్ తెలిపారు. గోదావరి అంటే పక్కా తెలుగు నెల. మరి, తమిళ ప్రేక్షకులకు నచ్చుతుందా? అనే సందేశం రావడం సహజం. చరణ్ మాత్రం ‘రంగస్థలం’ యూనివర్సల్ పాయింట్‌తో రూపొయింది చిత్రమని చెబుతున్నారు. అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చుతుందని అనడంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని అంటున్నారు. వీలైనన్ని ఎక్కువ భాషల్లో సినిమాను డబ్బింగ్ చేయాలనుకుంటున్నామని తెలిపారు. ముందుగా తమిళ్లో డబ్ చేస్తున్నారు. ఏప్రిల్ లేదా మే నెలలో మంచి డేట్ చూసుకుని విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో సుకుమార్ మీద చరణ్ కి బాగా గురి కుదిరింది. చిరంజీవితో సుకుమార్ సినిమా చూడాలని వుందని మనసులో మాటను బయట పెట్టారు.