కబాలికి ముందు రంజిత్ అంటే ఓ సంచలనం. అంత చిన్న వయసులో, రెండు సినిమాల అనుభవంతో సూపర్ స్టార్ సినిమాకి డైరెక్ట్ చేసే అవకాశం ఎలా దక్కించుకొన్నాడూ..??? అంటూ రంజిత్ని చూసి ఆశ్చర్యపోయారు, ఈర్ష్య పడ్డారు. కబాలి విడుదలైన రోజే.. ఈ సీన్ రివర్స్ అయ్యింది. కబాలి ఫ్లాప్‌కి రంజితే కారణం అంటూ రజనీ ఫ్యాన్స్ సైతం ఆవేశంతో ఊగిపోతున్నారు. సూపర్ స్టార్‌ని డీల్ చేయలేకపోయాడు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. వీటిపై రంజిత్ కూడా స్పందించాడు. ”ఈ సినిమాపై వచ్చిన పొగడ్తలు, విమర్శలు గమనించాను. రెంటింటినీ నేను పట్టించుకోను. నేను ఏం అనుకొన్నానో అది తెరపై చూపించగలిగాను. రజనీ సార్ కూడా మెచ్చుకొన్నారు” అంటున్నాడీ కుర్ర డైరెక్టర్.
రజనీ ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలని ఈ సినిమా తీయలేదట. ఓ కొత్త రజనీని చూపించాలని ప్రయత్నించాడట. రియలిస్టిక్ సినిమాలు తీయడంలో ఉన్న మజానే వేరని.. తాను కూడా అదే చేశానని, రజనీలోని స్టార్ కంటే రజనీలోని నటుడ్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించానని చెప్పుకొచ్చాడు రంజిత్. అయితే ఈ వివరణతో రజనీ ఫ్యాన్స్ సంతృప్తి పడడం లేదు. ఈ సినిమా కంటే లింగనే బెటర్.. అంటూ కౌంటర్లు విసురుతున్నారు. లింగకి సోదరుడు వచ్చాడంటూ కబాలికిని వర్ణిస్తున్నారు