తల్లిదండ్రుల శృంగారంపై ఘోరమైన వ్యాఖ్యలు చేసిన దాన్ని జోక్స్ గా చెలామణి చేసేందుకు ప్రయత్నించిన రణవీర్ అల్లాబదియా వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. చివరికి సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి వ్యాఖ్యలు కేవలం మగవాళ్లే కాదని ఆడ యూట్యూబర్లు కూడా చేస్తారని స్వాతి సచ్ దేవా నిరూపించారు.
స్వాతి ఓ ప్రమిుఖ యూట్యూబర్. స్టాండప్ కమెడియన్. ఇటీవల ఓ షోలో వైబ్రేటర్ గురించి జోకులేశారు. మహిళలు వైబ్రేటర్ వాడటం గురించి జోకులు వేస్తూ.. అందులో పాత్రధారులుగా తనను..తన తల్లినే తీసుకున్నారు. తన నిజ జీవితంలో నిజంగా జరిగిందో లేదో కానీ.. తన తల్లి వైబ్రేటర్ ను తాను చేశానని అప్పటి నుంచి తన తల్లి తన కళ్లలోకి చూడలేకపోయిందన్నారు. అయితే ఓ రోజు తన వైబ్రేటర్ ను తల్లి చూసిందన్నారు. తర్వాత ఇద్దరూ వైబ్రేటర్ గురించి మాట్లాడుకున్నట్లుగా జోకులు వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వరైల్ అయింది.
యూట్యూబర్లు .. తమ తల్లిదండ్రులను కించపరుస్తూ జోకులు వేయడంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు ఉండటంతో ఇప్పుడు మరోసారి స్వాతి అంశం హాట్ టాపిక్ గా మారింది. రాణవీర్ అల్లాబదియా కంటే స్వాతి సచ్ దేవా ఘోరమైన వ్యాఖ్యలు చేశారని ..తల్లిని కించపర్చడం తప్పని అంటున్నారు. రణవీర్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్వాతిపైనా అలాంటివే తీసుకోవాలని.. మహిళ అయినంత మాత్రాన ఊపేక్షించకూడదని అంటున్నారు.
ప్రస్తుతం స్వాతి సచ్ దేవా చెప్పిన జోక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కొంత మంది సమర్థించేవారు కూడా ఉన్నారు.