బాలీవుడ్ సినిమాలో హీరో హీరోయిన్ రొమాన్స్ కామన్. అదీగాక ప్రస్తుతం ఘాడ ప్రేమలో ఉన్న రణ్ వీర్, దీపికా ముద్దులాడుకోరా అంటే ఓకే కాని ఇక్కడ ముద్దాడింది సినిమాలో కాదు పబ్లిక్ ప్లేస్ లో అదీ ఎయిర్ పోర్ట్ లో అంటే కొంచం అవ్వాక్కవ్వాల్సిందే.. ఎట్టెట్టా.. పబ్లిక్ అంతా చూసే ఎయిర్ పోర్ట్ లో ఇద్దరు ముద్దులాట అని మీరు షాక్ అయ్యారు కదా. వివరాల్లోకి వెళ్తే..
బాలీవుడ్ హాట్ కపుల్స్ రణ్ వీర్ దీపికాల ఘాటు ప్రేమాయణం అందరికి తెలిసిందే. తరచు మీడియా కంట జంటగా కనిపించి షో చేయడం వీరికి అలావాటుగానే మారిపోయింది. మీడియా వారు కూడా దీపిక కనబడ్డదంటే వెంటనే అక్కడ రణవీర్ కోసం చూస్తూనే ఉంటారు. అయితే మొన్నటిదాకా ఫారిన్ టూర్ అంటూ జల్సా చేసి వచ్చిన వీరిద్దరు ముంబై ఎయిర్ పోర్ట్ లో ఒకరికొకరు సెండ్ ఆఫ్ ఇచ్చుకుంటూ లిప్ కిస్ పెట్టుకున్నారు.
అంటే అక్కడ ఎవరు చూడరు కదా అని అనుకున్నారో.. లేక మళ్లీ ఎప్పుడు కలుస్తామో అనే విరహంతోనే కాని ఇద్దరు ఎంచక్కా వారి పెదాలకు పనిచెప్పారట. మరి అసలే సెలబ్రిటీ మరి వారు అలా ముద్దులాట ఆడుతుంటే అందరు చూస్తూనే ఉండరుగా.. కొందరు వారి ఫోన్లకు కూడా పనిచెబుతారు. అలా వారిద్దరు ఎయిర్ పోర్ట్ దగ్గర సెండ్ ఆఫ్ ఇచ్చుకుంటూ పెట్టుకున్న ముద్దుల ఫోటోలు ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.
చూసిన వాళ్లంతా మరీ ఇంత రెచ్చిపోవడం మంచిది కాదమ్మా అసలే బాలీవుడ్ ప్రేమలకు సినిమాల్లానే రిలీజ్ అయ్యేదాక హిట్ అవుద్దో లేదో గ్యారంటీ ఇవ్వడం కష్టం వీరిద్దరేమో.. మొగుడు పెళ్లాల్లా ఎక్కడబడితే అక్కడ రెచ్చిపోయి రొమాన్స్ చేస్తున్నారు. మరి ఈ ముద్దులాటకు ముగింపు ఎప్పుడో చూడాలి.