పూరి సినిమాలు బాలీవుడ్‌కి వెళ్లడం కొత్త కాదు. ఇక్కడ దుమ్ము దులిపిన ‘పోకిరి’ అక్కడ ‘వాంటెడ్’గా వంద కోట్లు వసూలు చేసింది. పూరి కూడా అమితాబ్ బచ్చన్‌తో ‘బుడ్డా హోగాతేరా బాప్’ తీసి నిరూపించుకున్నాడు. ఇప్పుడు పూరికి మరోసారి బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్టు సమాచారం. పూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. మాస్, కమర్షియల్ సినిమాగా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుని.. తొలి నాలుగు రోజుల్లోనే 50 కోట్ల (గ్రాస్)కి చేరువైంది. ఈ సినిమా బాలీవుడ్‌లోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. రణవీర్ సింగ్‌తో ఈ సినిమా చేయాలని, పూరికి ఓ బాలీవుడ్ నిర్మాత ఆఫర్ ఇచ్చాడట. త్వరలోనే రణవీర్‌తో పూరి మీటింగ్ ఉంటుందని, ఆ తరవాత ఈ సినిమా రీమేక్ పై ఓ నిర్ణయానికి రానున్నాడని తెలుస్తోంది. మిగిలిన భాషల నుంచి కూడా రీమేక్ ఆఫర్లు రావడం మొదలయ్యాయి. కాకపోతే… పూరి ఈ సినిమాని హిందీలో తీయడానికే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది.