సహాయ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు రావు రమేష్. విలనీ, కామెడీ, పాజిటీవ్… ఇలా ఏపాత్ర అయినా ఆయన ముందు ఒదిగిపోతూనే ఉంటోంది. అయితే ఈమధ్య రావు రమేష్ జోరు కాస్త తగ్గింది. సీనియర్ నరేష్, మురళీ శర్మ లాంటివాళ్లు రావు రమేష్ పాత్రల్ని లాగేసుకుంటున్నారు. ఇప్పుడు మళ్లీ రావు రమేష్‌కి మంచి పాత్రలు దక్కుతున్నాయి. మజిలీలో ఓ మంచి పాత్ర చేశారు రావు రమేష్. ఇప్పుడు మన్మథుడు 2లోనూ ఓ కీలక పాత్ర దక్కించుకున్నారు. మారుతి దర్శకత్వం వహించబోతున్న కొత్త సినిమాలోనూ రావు రమేష్‌కి ఓ సరదా పాత్ర దక్కిందట. హీరో తరవాత… ఆ స్థాయిలో క్లిక్కయ్యే పాత్ర ఇదని, ఓరకంగా చెప్పాలంటే హీరోని సైతం డామినేట్ చేసే స్థాయిలో ఉంటుందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. రావు రమేష్ కెరీర్లోనే ఈ సినిమా గుర్తుండిపోయేలా ఉంటుందని చెబుతున్నారు. త్రివిక్రమ్, నందినిరెడ్డి, అజయ్ భూపతి చిత్రాల్లోనూ రావురమే ష్ కీలక పాత్రలు చేస్తున్నాడు. మొత్తానికి రావు రమేష్ మళ్లీ పూర్వటి ఫామ్‌లోకి వెళ్లిపోయినట్టే.