రాపాక వరప్రసాద్.. ఎమ్మెల్యే సీటిచ్చి.. రాజకీయ పునర్జన్మ ఇచ్చిన పవన్ కల్యాణ్‌కు.. అనధికారికంగా హ్యాండిచ్చేసినట్లే. ఆయన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్నా.. వెళ్లకుండా… తూర్పుగోదావరి జిల్లాలో ఓ చోట జరుగుతున్న కోడి పందేలు చూడటానికి వెళ్లారు. అక్కడకు మంత్రి కొడాలి నాని వస్తే. .ఆయనతో కలిసి.. పందాలను ఎంజాయ్ చేశారు. జనసేన విస్తృత స్థాయి సమావేశానికి ఏకైక ఎమ్మెల్యేగా ఆయనకు ఆహ్వానం లభించింది. కానీ.. రాపాక.. జనసేనతో ఉండటం కన్నా… వైసీపీతో ఉంటేనే.. తనకు రాజకీయ భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నట్లుగా తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది.
రాపాక వరప్రసాద్.. ఒకప్పుడు కాంగ్రెస్ నేత. వైఎస్ హయాంలో ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. కానీ తర్వాత ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నికలకు ముందు.. టిక్కెట్ కోసం ఆయన జగన్ వద్దకూ వెళ్లారు. రాపాకకు అంత సీన్ లేదని చెప్పి.. జగన్ పంపేశారు. ఆయనను పవన్ కల్యాణ్ దగ్గరకు తీశారు. టిక్కెట్ ఇచ్చారు. తీరా గెలిచిన తర్వాత రాపాక..తాను పవన్ కల్యాణ్ వల్ల గలవలేదని చెప్పుకోవడం ప్రారంభించారు. అంత సొంతంగా గెలిచే బలం ఉంటే.. ఆయన అప్పుడు టిక్కెట్ కోసం.. పవన్ కల్యాణ్ వద్దకు ఎందుకు వచ్చారని.. రాజోలు.. జనసేన కార్యకర్తలు చాలా రోజులుగా మండి పడుతున్నారు.
రాపాక వరప్రసాద్ అధికారికంగా.. వైసీపీలో చేరితే అనర్హతా వేటు పడుతుంది. అయితే.. ఒక్కరే ఎమ్మెల్యే కాబట్టి.. వైసీపీలో చేరినా.. చేరకపోయినా .. వచ్చే నష్టం ఏమీ ఉండదు. అందుకే.. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అడ్డగోలుగా సమర్థిస్తూ.. పవన్ కల్యాణ్‌ను కించ పరుస్తూ మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో రోజు రోజుకు విలువలు పడిపోతున్నాయని.. రాపాక వంటి వారిని చూపిస్తున్నారు జనసైనికులు.