జనసేన నుంచి వైసీపీకి ఫిరాయించిన రాపాక వరప్రసాద్‌తో వైసీపీ నేతలు కొత్త కథ వినిపించడం ప్రారంభించారు. ఆయన ఏదో పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు సీక్రెట్‌గా చిత్రీకరించినట్లుగా వీడియోను లీక్ చేసి.. తర్వాత ఆయనతోనే ఇది నిజం చెప్పించే విన్యాసాలు ప్రారంభించారు. ఎలాగూ కూలి మీడియా ఇలాంటి వాటిని హైలెట్ చేసేందుకురెడీగా ఉంటుంది. అసలు రాపాకే పిరాయింపు ఎమ్మెల్యే. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి మూడు వందల ఓట్లు కూడా తెచ్చుకోలేని నేతను .. అన్ని పార్టీలు తిరస్కరిస్తే జనసేన అధినేత పవన్ టిక్కెట్ ఇచ్చారు.
అతి కష్టం మీ ద గెలిస్తే పవన్ మీదే దారుణమైన కామెంట్లు చేస్తూ వైసీపీలో చేరిపోయారు. ఓ సందర్భంలో అరెస్ట్ చేస్తారంటే పవన్ గట్టిగా నిలబడ్డారు. అయినా ఏదో ఆశించి వైసీపీలో చేరడమే కాకుండా.. ఇప్పుడు టీడీపీ డబ్బులు ఆఫర్ చేసిందంటూ కొత్త కథలు అల్లుతున్నారు. ఎవరు చేశారంటే ఉండి ఎమ్మెల్యే చేశారంటారు. మ ళ్లీ ఆయన నేరుగా ఆఫర్ ఇవ్వలేదంటారు. ప్రలోభ పెట్టారంటారు. జనసేన ఎమ్మెల్యే.. అసెంబ్లీ లాబీల్లో కనిపిస్తే పిచ్చాపాటిగా మాట్లాడాం కానీ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడలేదని.. ఉండి ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేలు టీడీపీ నుండి డబ్బులు తీసుకున్నారని సజ్జల ఆరోపించారు. వారేమో నిరూపించాలని సవాల్ చేసి… సజ్జలపై రివర్స్ ఆరోపణలు చేస్తున్నారు. దానికి కౌంటర్ అన్నట్లుగా ఇలాంటి వీడియోలను వైసీపీ నేతలు విడుదల చేస్తున్నారు. అయితే ఇలాంటి చీప్ రాజకీయ టెక్నిక్కులు.. వైసీపీ, ఐ ప్యాక్ బ్రాండ్ అని ప్రజలకు అర్థమైపోయిందని ఎవరూ నమ్మే పరిస్థితి లేదంటున్నారు. అసలు రాపాక ఎంత తీసుకుని పవన్ కల్యాణ్‌ను మోసం చేశారో చెప్పాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.