జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు .. ఇంగ్లిష్ మీడియంపై.. పవన్ కల్యాణ్లైన్ ను ధిక్కరించారు. ఆయన ఇంగ్లిష్ మీడియంకు పూర్తి స్థాయి మద్దతు పలికారు. అసెంబ్లీలో తెలుగు మీడియం కోసం.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. తెలుగును కాపాడాలంటూ.. మన నుడి.. మన నది పేరుతో.. ఏకంగా ఓ ఉద్యమమే ప్రారంభించారు. తెలుగు మీడియం ఉండాల్సిందేనంటూ.. ఆవేశంగా స్పందిస్తున్నారు. కానీ అసెంబ్లీలో ఇంగ్లిష్ మీడియంపై మాట్లాడిన జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం.. పవన్ వాయిస్‌ను సభలో రిప్రెజెంట్ చేయడంలో విఫలమయ్యారు. ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడి కలకలం రేపారు.
రాపాక వరప్రసాద్.. మొదటి నుంచి అసెంబ్లీలో.. ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతున్నారు. గతంలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సమయంలో.. జగన్ ను.. వీరుడు.. శూరుడు అంటూ పొగిడేశారు. నిజానికి బడ్జెట్లో ఉన్న డొల్లతనాన్ని.. జనసేన బయట బయట పెట్టి విమర్శలు గుప్పించింది. జనసేన వాయిస్‌ను.. అసెంబ్లీలో వినిపించాల్సిన రాపాక మాత్రం… జగన్మోహన్ రెడ్డిని పొగడటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. బయట మాత్రం.. ఆయనకు జనసేన పార్టీ నేతలు అండగా ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం.. ఓ పెట్టీ కేసులో రాపాక వరప్రసాద్ ను అరెస్ట్ చేయాడనికి ఏలూర్ రేంజ్ ఐజీ సహా.. అనేక మంది రంగంలోకి దిగారు. చివరికి పవన్ కల్యాణ్.. కల్పించుకుని… తాను రోడ్డెక్కుతానని వార్నింగ్ ఇచ్చిన తర్వాతనే పోలీసులు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత కూడా.. రాపాకకు.. పార్టీలో.. తగినంత ప్రాధాన్యం ఇస్తున్నారు పవన్ కల్యాణ్.
అయితే.. జనసేన వాయిస్‌ను అసెంబ్లీలో ప్రతిధ్వినించేలా చేయాల్సిన… రాపాక మాత్రం.. జగన్ భజనకు సమయం కేటాయిస్తున్నారు. దీంతో.. రికార్డుల్లో జనసేన పార్టీ.. ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్లుగా మారిపోతోంది. ఈ పరిస్థితి.. జనసేన కార్యకర్తల్లో… ఆందోళనకు కారణం అవుతోంది. అసెంబ్లీలో పార్టీ వాయిస్‌ను.. పకడ్బందీగా వినిపించాల్సిన అవసరాన్ని పవన్ కల్యాణ్… రాపాక వరప్రసాద్‌కు గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు.