జనసేన ఏకైక ఎమ్మెల్యే .. జగన్ రెడ్డిని నమ్ముకుని రోడ్డున పడిపోయే పరిస్థితికి వచ్చారు. టీడీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావును చేర్చుకుని.. రాపాకను అమలాపురం ఎంపీగా ఇంచార్జ్ పదవి ఇచ్చారు. ఏదో ఓ టిక్కెట్ లే అనుకున్న రాపాకకు రెండు రోజుల్లోనే జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ అర్థమయిందేమో కానీ.. వెంటనే రివర్స్ అవుతున్నారు. తనకు రాజోలు ఎమ్మెల్యే టిక్కెట్టే కావాలని ఎంపీ టిక్కెట్ వద్దని అంటున్నారు. తన అనుచరులతో ఆందోళనలు ప్రారంభింపచేశారు.
టీడీపీ నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకి రాజోలు టికెట్ ఇవ్వడంతో రాపాక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జగన్ ఏది చెబితే అది చేస్తానన్న రాపాక వరప్రసాద్ ..అమలాపురం ఎంపీగా పోటీ చేయమనడంతో ఒక్క సారిగా షాక్కు గురయ్యారు. తన విధే్యతను ప్రదర్శించుకోవడానికి స్టేట్ మెంట్ ఇస్తే నిజంగానే తనను గెంటేశారని ఆయన ఫీల్ లఅవుతున్నారు. రాజోలు టికెట్ విషయంలో సీఎం జగన్ పునరాలోచన చేయాలంటున్న రాపాక .. సర్వేలు నిర్వహించి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజోలు సీటు మార్చకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
అమలాపురం ఎంపీ టిక్కెట్ విషయంలో జగన్ ఇప్పటికే చాలా మందికి హామీలు ఇచ్చారు. చివరికి ఎవరికి టిక్కెట్ ఇస్తారో తెలియదు కానీ.. ఆ ఒక్క సీటు చూపించి చాలా మంది దళిత నేతల టిక్కెట్లు చించేస్తున్నారు. దీంతో రాపాక మేలుకున్నారు. కానీ రాపాకను.. జగన్ కేర్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే 2014లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి.. పోటీ చేసిన రాపాకకు స్వతంత్ర అభ్యర్థిగా వచ్చిన ఓట్లు మూడు వందలు మాత్రమే. నియోజకవర్గంలో ఆయనకు ఎలాంటి పలుకుబడి లేకపోవడంతో.. జగన్ పట్టించుకునే అవకాశాలు లేదు. గత ఎన్నికలకు ముందు వైసీపీ కోసం పని చేసినా జగన్ హ్యాండివ్వడంతో జనసేనలో చేరారు. పవన్ టిక్కెట్ ఇచ్చి గెలిపించడంతో.. మళ్లీ జగన్ పంచన చేరి పవన్ ను తిట్టారు. ఇప్పుడు జగన్ మళ్లీ హ్యండిస్తున్నారు. ఈ సారి పవన్ ఆదరించే అవకాశం ఉంది.