ఎదిగే వయసులో.. ప్రేమ పేరుతో వేసే వేషాలకు యువతులు… ఆకర్షితులైతే.. ఏం జరుగుతుందో.. వరంగల్ జిల్లా మానస విషాదాంతమే ఉదాహరణ. తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేస్తానంటే.. అప్పటి వరకూ మాయమాటలు చెప్పిన కుర్రాడితో.. వెళ్లింది. అతను.. అటూ ఇటూ.. తిప్పి చివరకు అత్యాచారం చేశాడు. విపరీతంగా బ్లీడింగ్ అయి.. మానస ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది.
వరంగల్‌కు చెందిన మానస అనే యువతికి ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఇంటి దగ్గర ఖాళీగా ఉండే మానసకు..స్మార్ట్ ఫోన్ తోడు కావడంతో.. ఆ యువకుడు మాయ మాటలు చెప్పడం ప్రారంభించాడు. ఆ మాటల మాయలో పడిన మానస… తన పుట్టిన రోజును బయట పార్టీ చేద్దామంటే.. యువకుడితో పాటు వెళ్లింది. ఇంట్లో గుడికి వెళ్తున్నానని చెప్పి.. ఆ యువకుడి వెంట వెళ్లింది. ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. అతను అత్యాచారయత్నం చేశారు. తీవ్రమైన రక్తస్రావం అయి.. మానస ప్రాణాలు కోల్పోయింది.
పులి సాయి అనే .. ఆ యువకుడు ఏ మాత్రం కంగారు పడకుండా.. సహజమరణంగా చిత్రీకరించేందుకు.. కొత్త బట్టలు కొని శవానికి తొడిగి.. వాళ్లింటి సమీపంలోనే పడేసి వెళ్లిపోయాడు. కానీ పోలీసులకు.. వెంటనే.. అది అత్యాచారం, హత్య అని వెల్లడైంది. సీసీ కెమెరాలు…ఫోన్ రికార్డులను బయటకు తీసిన పోలీసులకు సీన్ మొత్తం అర్థమైంది. వెంటనే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన.. అమ్మాయిలు.. మంచి మాటలు చెప్పే..మృగాళ్ల వలలో ఎంత తేలికగా పడిపోతారో.. మరోసారి బయట పెట్టింది.