నవతరం కథానాయికల జోరుతో ఈమధ్య రాశీఖన్నా వెనకబడిపోయింది. 2018లో ఆమె నుంచి చెప్పుకోదగిన సినిమాలేం రాలేదు. `తొలి ప్రేమ`లాంటి హిట్ తరవాత కూడా.. భారీ అవకాశాల్ని చేజిక్కించుకోలేకపోయింది. అయితే 2019 లో మాత్రం రాశీకి శుభ శకునాలే కనిపిస్తున్నాయి. వరుసగా సినిమాలపై సంతకాలు చేస్తోంది. ఇటు తెలుగు, అటు తమిళం రెండు చోట్లా హవా చూపిస్తోంది.
విజయ్ దేవరకొండ – క్రాంతి మాధవ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో రాశీఖన్నాని కథానాయికగా ఎంచుకున్నారు. క్రాంతి మాధవ్ సినిమాల్లో కథానాయికల పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. పైగా ఇది విజయ్ సినిమా. కాబట్టి రాశీ పాత్ర వరకూ ఢోకా లేకపోవొచ్చు. తమిళంలో విజయ్‌సేతుపతి పక్కన ఓ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది రాశీ. విజయ్ చందర్ దర్శకత్వం వహించే ఈ చిత్రం పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగుతుంట. మరోవైపు శింబు పక్కన కథానాయికగానూ ఎంపికైంది రాశీ. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించే ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇవి కాక రాశీ మరో రెండు తెలుగు చిత్రాల్లో నటించడానికి అంగీకరించిందని తెలుస్తోంది. మొత్తానికి రాశీ ఫామ్ లోకి వచ్చినట్టే కనిపిస్తోంది. ఈ అవకాశాల్ని ఎంత వరకూ సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.