కథానాయికలకు వచ్చిన సినిమాల్ని వచ్చినట్టు ఒప్పుకోవడం మినహా మరో మార్గం లేదనుకొంటాం. కానీ… నచ్చిన సినిమాల్ని మాత్రమే చేసేవాళ్లు కూడా ఉన్నారు. రాశీఖన్నా కూడా ఆ టైపే నట. ”నా దగ్గరకు వచ్చిన ప్రతీ సినిమానీ నేను ఒప్పుకోను. కథ, నా పాత్ర ఏది నచ్చకపోయినా నేను తిరస్కరిస్తా. రొటీన్ స్క్రిప్టుల్ని అస్సలు జీర్ణించుకోలేను. నేను వదులుకొన్న సినిమాల సంఖ్య చెబితే మీరు ఆశ్చర్యపోతారు” అంటోంది రాశీ. తాను ఎక్కడికెళ్లినా ‘ఊర మాస్ సినిమాలెప్పుడుచేస్తావ్’ అని అడుగుతున్నార్ట. ఆ పదం అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టిందని. ఇప్పుడు ఊర మాస్ అంటే ఏమిటో తెలిసిందని… సుప్రీమ్ లాంటి సినిమాలు ఆజాబితాలోనికే వస్తాయని అంటోంది రాశీ.
అయితే తనకు మాస్ మసాలా సినిమాలకంటే క్లాసిక్ సినిమాలంటేనే ఇష్టమట. గీతాంజలి టైపు సినిమాల్ని చేస్తే… ఎక్కువ కాలం గుర్తుండిపోతామని అంటోంది రాశీ. అలాంటి కథ కోసం ఎదురుచూస్తోందట రాశీఖన్నా. ఈ రోజుల్లో గీతాంజలి టైపు సినిమాల్ని ఎవరు తీస్తారు చెప్పండి? రాశీది మరీ.. అత్యాసే అనిపిస్తోంది కదూ. ప్రస్తుతం గోపీచంద్‌తో ఆక్సిజన్‌లో నటిస్తోంది. రామ్ సినిమా హైపర్లోనూ తనే కథానాయిక.