రష్మిక ఇప్పుడు నేషనల్ క్రష్. బాలీవుడ్ స్థాయిలో ఆమె పేరు మార్మోగిపోతోంది. పుష్ప, యానిమల్, పుష్ప 2 సినిమాలతో బాలీవుడ్ లో పాపులారిటీ పెంచుకొంది. ఇటీవల విడుదల ‘చావా’తో మరో సూపర్ హిట్ దక్కించుకొంది. త్వరలో సల్మాన్ ఖాన్ – మురుగదాస్ కాంబోలో రాబోతున్న సికిందర్లో క ఊడా తనే కథానాయిక. ఇది కూడా కమర్షియల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకొంటుందన్న నమ్మకం ఉంది.
అందుకే రష్మిక క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి బాలీవుడ్ నిర్మాణ సంస్థలు ముందుకొస్తున్నాయి. బాలీవుడ్‌కు చెందిన ఓ బడా నిర్మాణ సంస్థ రష్మికతో ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేసిందని సమాచారం. దాదాపు రూ.100 కోట్లతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నార్ట. కథా చర్చలు మొదలయ్యాయని, ఓ క్రేజీ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్‌ని టేకప్ చేస్తారని తెలుస్తోంది. రష్మిక పై రూ.100 కోట్ల సినిమా ప్లాన్ చేయడం మామూలు విషయం కాదు. అక్కడున్న బడా బడా కథానాయికలతోనే ఇంతింత బడ్జెట్లు వర్కవుట్ అవ్వడం లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి కోట్లు కొల్లగొట్టిన అనుభవం కూడా రష్మికకు లేదు. కానీ… తన క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొనే సదరు నిర్మాణ సంస్థ ఈ సాహసం చేస్తోందని తెలుస్తోంది. రష్మికపై సినిమా అంటే ఇప్పుడు అన్ని భాషల్లోనూ హాట్ కేకే. ఓటీటీ నుంచి మంచి మొత్తం రాబట్టుకోవొచ్చు. ఆ ధైర్యంతోనే ఈ రిస్క్ చేస్తున్నారేమో. హీరోయిన్ గా రష్మిక ఒక్కో చిత్రానికి రూ.4 నుంచి రూ.5 కోట్ల పారితోషికం అందుకొంటోంది. సినిమా అంతా తనపైనే నడుస్తుంది కాబట్టి, బల్క్ డేట్లు అవసరం కాబట్టి, తన పారితోషికం రూ.10 కోట్లకు పెంచే అవకాశాలున్నాయని టాక్. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ‘కుబేర’తో పాటుగా ‘గాళ్ ఫ్రెండ్’ అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది రష్మిక.