చిరంజీవి – శివ కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం `ఆచార్య`. కాజల్ ఓ కథానాయిక. అక్టోబరు నుంచి కొత్త షెడ్యూల్ మొదలయ్యే అవకాశం ఉంది. ఇందులో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ పక్కన ఓ కథానాయిక కోసం చిత్రబృందం అన్వేషిస్తోంది. చాలా మంది పేర్లు పరిశీలనకు వచ్చాయి. చివరికి రష్మిక పేరు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. చరణ్ – రష్మికలు అక్టోబరు నుంచే సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉంది.
“రష్మికతో చర్చలు జరుపుతున్న విషయం నిజమే. అయితే… ఇంకా ఖరారు కాలేదు. రష్మిక చేతిలో చాలా సినిమాలున్నాయిప్పుడు. డేట్లు సర్దుబాటు కావల్సివుంది. `ఆచార్య` టీమ్ తొలి ఆప్షన్ రష్మికనే. తనకు కుదరని పక్షంలో మరో కథానాయికని తీసుకుంటాం” అని ‘ఆచార్య’ టీమ్ లోని ఓ కీలక సభ్యుడు తెలిపారు. ప్రస్తుతం `పుష్ష`లో నటిస్తోంది రష్మిక. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా చిత్తూరు యాస కూడా నేర్చుకుంటోంది. `ఆచార్య`లో నటించాలా? వద్దా? అనే నిర్ణయం ఇప్పుడు రష్మిక చేతుల్లోనే వుంది.