రష్మిక మందన్న `ది గర్ల్ ఫ్రెండ్` టైటిల్ తో ఓ లవ్ స్టోరీ చేస్తోంది. దీక్షిత్ శెట్టి కథానాయకుడు. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలు. ఇప్పుడు టీజర్ ని బయటికి వదిలారు.
విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ టీజర్ ప్రారంభమైయింది.
నయనం నయనం కలిసే తరుణం
యదనం పరుగే పయనం పెరిగే వేగం
నా కదిలే మనసుని అడిగా సాయం
ఇకమీదట నువ్వే దానికి గమ్యం
విసిరిన నవ్వుల వెలుగుని చూసా
నవ్వాపితే పగలే చీకటి తెలుసా
నీకని మనసుని రాసిచ్చేసా
పడ్డానేమో ప్రేమలో బహుశా
విజయ్ దేవరకొండ వాయిస్ లో వినిపించిన ఈ కవిత ప్రేమకథ లోతుకి అద్దం పట్టింది.
టీజర్ లో ప్రతి షాట్ రష్మిక పాత్రపైనే ఫోకస్ చేసింది. డియర్ కామ్రేడ్ తర్వాత రష్మిక ప్రేమకథ చేయలేదు. ఇప్పుడు అలాంటి ఎమోషన్ ని చూపించే అవకాశం ది గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది. టీజర్ లో రష్మిక డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ క్యారెక్టర్ ఆర్క్ లోని యూనిక్ నెస్ ని తెలియజేస్తున్నాయి.
టీజర్ లో కథ గురించి ఏ మాత్రం హింట్ ఇవ్వలేదు కానీ.. ఓ విలక్షణమైన అమ్మాయి జీవితంలో చోటు చేసుకున్న వైవిధ్యమైన లవ్ స్టొరీ అనే భావన కలిగించింది. దీక్షిత్ కి స్క్రీన్ ప్రజెన్స్ తక్కువే. బీజీఎంగా వినిపించిన పాట అర్ధవంతంగా వుంది. ”ఇదేదో పికప్ లైన్ అయితే కాదు కదా.. అస్సలు పడను’ అని రశ్మిక చెప్పిన డైలాగ్ టీజర్ లో కొసమెరుపు.