విజయ్ దేవర కొండ- రష్మిక అఫ్ స్క్రీన్ కూడా క్రేజీ జోడి. వీరిద్దరు ఎక్కడ ఒక్కటిగా కనిపించినా గాసిప్స్ పేజీలు నిండిపోతుంటాయ్. తాజాగా విజయ్- రష్మిక పెళ్లి చేసుకుంటారని, ఈ ఏడాది చివరిలో శుభవార్త చెబుతారని రూమర్స్ వినిపించాయి. అయితే ఈ రూమర్స్ ని విజయ్ దేవర కొండ తనదైన శైలిలో ఖడించాడు. పెళ్లి వార్తల్లో నిజం లేదని చెప్పాడు.
ఇప్పుడు రష్మిక తన వైపు నుంచి క్లారిటీ ఇచ్చింది. పెళ్లి వార్తలు చూసి నవ్వుకున్నాని చెప్పింది. ” పెళ్లి వార్తలు నా ద్రుష్టికి వచ్చాయి. ఇలాంటి వార్తలు నాకు కొత్తకాదు. ఆ వార్తలు చూసి నవ్వుకోవటం అలవాటైపోయింది. ప్రేమించి, పెళ్లి చేసుకునేంత సమయం నా దగ్గర లేదు.” అని చెప్పుకొచ్చింది రష్మిక.
రష్మిక ఇప్పుడు టాప్ లీగ్ లో వుంది. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ విజయాలు నమోదు చేస్తున్నాయి. పుష్పతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న రష్మిక .. ఇప్పుడు ఆడవాళ్ళూ మీకు జోహార్లు సినిమాతో ప్రేక్షకులని అలరించడానికి సిద్దమౌతుంది. ఇదే కాకుండా బాలీవుడ్ లో కూడా ఆమె నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్దమౌతున్నాయి.