దుల్కర్ సల్మాన్ – హను రాఘవపూడి కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలసిందే. వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది. ఇందులో ఇద్దరు కథానాయికలున్నారు. ఓ నాయికగా పూజా హెగ్డేని ఎంపిక చేశారు. రెండో కథానాయికగా.. రష్మిక నటించబోతోందని ప్రచారం జరిగింది. అయితే.. ఆ స్థానం రాశీఖన్నాకు దక్కినట్టు తెలుస్తోంది. 1980 నాటి ప్రేమ కథ ఇది. సైనిక నేపథ్యం కూడా ఉంటుంది. దుల్కర్ ఓ లెఫ్ట్ నెంట్ ఆఫీసర్గా నటించబోతున్నాడు.కథలో నాయికలిద్దరివీ సమ ప్రాధాన్యం ఉన్న పాత్రలని తెలుస్తోంది. స్క్రిప్టు పనులన్నీ పూర్తయ్యాయి. 2021 జనవరిలో ఈ చిత్రం పట్టాలెక్కుతుంది. విశాల్ శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.