ఈమధ్యే అమేజాన్ ప్రైమ్ లో విడుదలైంది… `నిశ్శబ్దం`. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. అనుష్క, మాధవన్ లాంటి స్టార్లు పనిచేయడంతో… ఈసినిమాపై కాస్త క్రేజ్ పెరిగింది. అయితే విషయం లేకపోవడంతో… విమర్శకులు, విశ్లేషకులు, ప్రేక్షకులు పెదవి విరిచారు. మాధవన్ ఫ్లాష్ బ్యాక్ అయితే ఘోరంగా ఉందని కామెంట్లు వినిపించాయి. దీనిపై స్పందించిన మాధవన్ తన అభిమానులకు క్షమాపణ కూడా చెప్పాడు.
కాకపోతే.. అమేజాన్కి `నిశ్శబ్దం` మంచి రేటింగులనే తీసుకొచ్చింది. సౌత్ ఇండియాలో విడుదలైన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో…. ఈ సినిమాకే ఎక్కువ రేటింగులు వచ్చినట్టు అమేజాన్ ప్రతినిథులు తెలిపారు. కథలో లోపాలున్నా, మంచి టెక్నికల్ వాల్యూస్ ఉండడం, అనుష్కలాంటి పెద్ద స్టార్లు పనిచేయడం ఈ సినిమాకి మంచి రేటింగులు వచ్చేలా చేశాయని అమేజాన్ చెబుతోంది. వివిధ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయడం కూడా కలిసొచ్చింది. ఫ్లాపయిన సినిమాకీ అప్పుడప్పుడూ కలక్షన్లు ఊరట కలిగిస్తుంటాయి. అలా.. చతికిల పడుతుందనుకున్న `నిశ్శబ్దం` ఓటీటీలో కాస్త నిలబడగలిగింది. ఓరకంగా అనుష్కకు కాదు.. అమేజాన్కే ఈ రేటింగులు కాస్త ఊరట కలిగించినట్టు,.