నైతిక విలువలు ఉన్న నేతల్ని వెదికి వెదికి మరీ.. పార్టీలోకి తీసుకుంటున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తాజాగా ఈ జాబితాలో.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు చేరారు. ఈ నెల ఒకటో తేదీన ఆయన… జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో విజయవాడలో… పార్టీలో చేరబోతున్నారు. . కొత్త రాజకీయం కోసం.. జనసేన చేసే ఉద్యమంలో భాగం కాబోతున్నారు. ఆయనకు వేమూరు టిక్కెట్‌ను కన్పర్మ్ చేసినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. కొంత మంది సీనియర్లు ఉన్నప్పటికీ.. తటస్థుని కోటాలో.. చంద్రబాబు … ప్రత్తిపాడు టిక్కెట్ ను… రావెల కిషోర్ కు ఇచ్చారు. గెలిచారు. అదృష్టం కలసి రావడంతో.. మంత్రి పదవి కూడా దక్కింది. దాంతో ఆయన… చంద్రబాబు తర్వాత తానే అన్నట్లు వ్యవహరించడం ప్రారంభించారు. చాలా సార్లు బహిరంగంగా చెప్పుకున్నారు కూడా. సొంత నియోజకవర్గంలోని టీడీపీ నేతలతో కూడా… అదే తరహా పెత్తనాన్ని కొనసాగించడంతో అందరికీ దూరమైపోయారు. చివరికి ఆయన కమారుడు… హైదరాబాద్ లో ఓ ముస్లిం యువతిని చెరబట్టే ప్రయత్నం చేయడంతో పెద్ద కేసు అయిపోయిది. ఆ కేసులో ఎలాగోలా బయటపడ్డారు కానీ.. పదవిని మాత్రం… పోగొట్టుకున్నారు. ఆయన పదవి పోగొట్టుకోవడానికి అదొక్కటే కాదు.. మంత్రిగా ఉన్నప్పుడే… వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డితో వైసీపీలో చేరడానికి చర్చలు జరిపారు. ఓ సారి గన్మెన్లను వదిలేసి సీక్రెట్ గా వెళ్లడంతో సీఎం మొత్తం గుట్టును ఇంటలిజెన్స్ ద్వారా బయటకు రాబట్టారు. ఆ తర్వాత పదవి ఊడిపోయింది. అప్పుడే ఆయన వైసీపీలో చేరతారని అనుకున్నారు కానీ.. జగన్మోహన్ రెడ్డి మాత్రం దూరం పెట్టారు. దాంతో.. టీడీపీలో ఆదరణ లేక… వైసీపీ చేర్చుకోక సతమతమయ్యారు. ఈ మధ్యలో మందకృష్ణ మాదిగను.. అడ్డం పెట్టుకుని కొంత రాజకీయం చేయాలని ప్రయత్నం చేశారు. మధ్యలో అంబేద్కర్ బొమ్మతో… సొంత గుర్తింపు ప్రయత్నాలు చేశారు. ఎవీ వర్కవుట్ కాలేదు. చివరికి.. ఆయనకు జనసేన ఆశాదీపంలా కనిపించింది. పవన్ కల్యాణ్ తో ఇప్పటికే రెండు సార్లు సమావేశమై… తన టిక్కెట్ విషయంలో కన్ఫర్మ్ తెచ్చుకున్న తర్వాత… డిసెంబర్ ఒకటోతేదీన ముహుర్తం చూసుకుని చేరిపోతున్నారు. సాధారణంగా అధిార పార్టీ నుంచి వెళ్లిపోతున్నారంటే.. ఎవరైనా బుజ్జగించడానికి ప్రయత్నిస్తారు కానీ.. టీడీపీలో మాత్రం.. హమ్మయ్య.. రావెల ఇప్పటికి వెళ్లిపోతున్నాడా… అని రిలీఫ్ ఫీలవుుతున్నారు.