రాజమౌళి ‘ఈగ’ను హీరో చేసి సినిమా తీశారు. ఆరేళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా జనాలకు నచ్చింది. మంచి విజయం సాధించింది. ప్రస్తుతంరవిబాబు పంది పిల్లను పెట్టి ‘అదుగో’ అనే సినిమా తీశారు. త్వరలో సినిమాను విడుదల చేస్తార్ట! చాలారోజుల నుంచి చెబుతున్న మాటే ఇది. కాకపోతే ఇటీవల సినిమా పనుల్లో వేగం పెంచారు. ప్రచార కార్యక్రమాల్లో కదలిక వచ్చింది. శుక్రవారం టీజర్ విడుదల చేశారు. అందులో ఆల్మోస్ట్ యానిమేషన్ పంది పిల్ల కనిపించింది. లైవ్ యాక్షన్ అండ్ త్రీడీ యానిమేషన్ సినిమాగా దర్శకుడు రవిబాబు, చితాన్ర్ని సమర్పిస్తున్న సురేశ్‌బాబు చెబుతున్నారు. లైవ్ యాక్షన్ అంటే మనుషులు, జంతువులు నటించడం… త్రీడీ యానిమేషన్ అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా మనుషుల్ని, జంతువుల్ని సృష్టించాడు. మరి, లైవ్ యాక్షన్ అండ్ త్రీడీ యానిమేషన్ అంటే? కుదిరిన సన్నివేశాల్లో పంది పిల్లతో ఒరిజినల్‌గా నటింపజేయడం! లేని పక్షంలో గ్రాఫిక్స్ చేయడం! సుమంత్, కమలినీ ముఖర్జీ జంటగా నటించిన ‘గోదావరి’లో దర్శకుడు శేఖర్ కమ్ముల ఇదే విధంగా చేశారు. అందులో రెండు కుక్క పిల్లల చేత కీలక పాత్ర చేయించారు. లాంగ్ షాట్స్‌లో నిజంగా కుక్క పిల్లలను చూపించారు. అవి డైలాగులు చెప్పాల్సి వచ్చిన చోట యానిమేషన్ చేశారు. సేమ్ టు సేమ్ దర్శకుడు రవిబాబు కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యార్ట! కొన్ని సన్నివేశాల్లో నిజమైన పంది పిల్లను చూపించి, ఎక్స్ప్రెషన్లు ఇస్తూ డైలాగులు చెప్పాల్సిన సన్నివేశాల్లో యానిమేషన్ పంది పిల్లను చూపించారని సమాచారం! ప్రస్తుతానికి టీజర్లో కేవలం పంది పిల్లను మాత్రమే చూపించారు. మనుషులతో పంది పిల్ల ఎలాంటి విన్యాశాలు చేస్తుందనేది సినిమాలో చూపిస్తారేమో!!