ర‌విబాబు అడ‌ల్ట్ కామెడీని న‌మ్ముకుంటున్నాడా?

ర‌విబాబు టైమ్ అస్స‌లు బాలేదు. వ‌చ్చిన సినిమా వ‌చ్చిన‌ట్టు వెళ్లిపోతుంది. త‌న సృజ‌న‌, కొత్త ఆలోచ‌న‌లు, క్రియేటివిటీ ఏమైపోయాయో అర్థం కాకుండా పోయాయి. న‌మ్ముకున్న థ్రిల్ల‌ర్లు ముంచేశాయి. కామెడీ ట్రాకు త‌ప్పింది. అందుకే ఈసారి అడ‌ల్ట్ కామెడీ న‌మ్ముకున్నాడ‌నిపిస్తోంది. అవును.. ర‌విబాబు త‌న కొత్త సినిమా మొద‌లెట్టేశాడు. దీనికి `క్ర‌ష్‌` అనే పేరు పెట్టాడు. ఈరోజు పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేశారు. హీరోయిన్ ఫేస్‌ని దాచేస్తూ.. బికినీ భామ‌ని రంగంలోకి దింపాడు. ఆ బికినీ పాప‌ని చూస్తూ లొట్ట‌లేస్తున్న ముగ్గురు అబ్బాయిల పోజులు చూస్తుంటే ఇది అడ‌ల్ట్ కామెడీ అన్న అనుమానం నిజం అవుతోంది. జ‌న‌వ‌రి 24 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. ర‌విబాబు ద‌ర్శ‌కుడిగా మారిన తొలి సినిమా `అల్ల‌రి`లోనూ అడ‌ల్ట్ కామెడీ ల‌క్ష‌ణాలు కొన్ని క‌నిపిస్తాయి. అయితే అందులో ఫ‌న్ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. ఈసారి పూర్తిగా బూతు, ద్వందార్థాల‌పై దృష్టి పెట్టిన‌ట్టున్నాడు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close