సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చాలా వస్తాయి. కానీ స్టడీలు మాత్రం కొన్నే ఉంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రవిప్రకాష్ స్టడీ హాట్ టాపిక్ అవుతోంది. RTV స్టడీ పేరుతో రవి ప్రకాష్ ఓ రకంగా ఫలితాల అంచనాలను ప్రకటిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా రిజల్ట్ ఎలా ఉంటుందో చెబుతూండటంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణలో బీజేపీకి ఎనిమిది, కాంగ్రెస్ కు ఎనిమిది , మజ్లస్ కు ఒక్కటి లోక్ సభ సీట్లు వస్తాయని అంచనా వేశారు. ఇది హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ కు ఒక్కటి కూడా రాదా అని చర్చించుకోవడం ప్రారంభించారు. వాస్తవ పరిస్థితులు అలాగే ఉన్నాయని ఎక్కువ మంది అంచనా.
తాజాగా ఆయన ఏపీ స్డడీ కూడా ప్రకటిస్తున్నారు. ముందుగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తున్నారు. మూడు రోజుల పాటు మూడు ప్రాంతాల స్టడీని ప్రకటిస్తున్నారు. మొదటి రోజు రాయలసీమ ఫ లితాలను ప్రకటించారు. వైసీపీ మెజార్టీ సీట్లను దక్కించుకుంటుందని చెప్పారు. 29 వైసీపీ.. 22 టీడీపీ, ఒకటి కాంగ్రెస్ ఖాతాలో పడుతుందంటున్నారు. ఈ స్టడీ చర్చనీయాంశమయింది. కాంగ్రెస్ ఖాతా తెరుస్తుందా అని ఆశ్చర్యపోతున్నారు. స్టడీలో కాంగ్రెస్ కు వస్తుందని ప్రకటించిన మడకశిరలో పరిస్థితి కాంగ్రెస్ కు అనుకూలంగానే ఉంది. మడకశిరలో మాజీ మంత్రి శైలజానాథ్ గెలవొచ్చని.. రఘువీరారెడ్డి తన ప్రయత్నం అంతా చేస్తున్నారు. అందుకే బాగా స్టడీ చేసినట్లుగానే ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. శుక్రవారం కోస్తా. శనివారం ఉత్తరాంధ్ర స్టడీని రవి ప్రకాష్ ప్రకటించనున్నారు.
టీవీ9 రవిప్రకాష్ అంటే ఓ బ్రాండ్. ఏపీలో ఎలక్ట్రానిక్ మీడియా ఆదిపురుష్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జర్నలిస్టు. తర్వాత రాజకీయాల్లో ఆయన అండర్ గ్రౌండ్ కు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆయనకు టీవీ9 గ్రూపులో 8 శాతం వరకూ మైనర్ వాటా ఉంది. ఇటీవల ఆయన ఆర్ టీవీ పేరుతో డిజిటల్ మీడియాను ప్రారంభించారు. మెల్లగా తనదైన శైలిలో దానిని దారిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. విస్తృతమైన నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. Rtv వేదికగానే తన స్టడీని ప్రకటిస్తున్నారు. ఈ స్టడీ ద్వారా బాస్ ఈజ్ బ్యాక్ అని అనిపించుకుంటున్నారు .