టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్… మళ్లీ జీరో నుంచి తన కెరీర్‌ను ప్రారంభించబోతున్నారు. ఆయన సొంతంగా.. ఓ కొత్త చానల్‌ను లాంచ్ చేసేందుకు… ” ప్రి ప్రొడక్షన్ ” పనులు చాలా వేగంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ.. తన సంపాదనతో పాటు.. కొంత మంది ఇన్వెస్టర్ల సాయం కూడా తీసుకుంటున్నారని చెబుతున్నారు. అయితే టీవీ9 అనుభవాల రీత్యా… ఆయన ఏ ఇన్వెస్టర్ దగ్గర కూడా.. కమాండింగ్ షేర్లు ఉండేలా… పెట్టుబడులు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. చాలా మైనర్ పెట్టుబడిని మాత్రమే.. ఇతరుల వద్ద తీసుకుని.. మిగతా మొత్తాన్ని తానే స్వయంగా సమకూర్చుకుని చానల్‌ను లాంచ్ చేయాలని.. ప్రిపేర్ అవుతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
కొత్త చానల్ కోసం రవిప్రకాష్ ప్రిపరేషన్..!
తెలుగు మీడియా రంగంలో ఇప్పుడు.. ఉన్న పరిస్థితులతో.. ఏ మీడియా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. కనీస స్పందన కూడా వ్యక్తం చేయడం లేదని..దీని వల్ల ” మీడియాలో వాక్యూమ్” ఉందనే భావన… ప్రజల్లో ఉందని.. రవిప్రకాష్ భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మీడియాలు మొత్తం.. ప్రభుత్వానికి బాకా ఊదుతున్నాయి. తప్పులను ఎత్తి చూపలేకపోతున్నాయి. ఈ కారణంగా… వాటన్నిటికంటే భిన్నంగా.. ఎవరికీ భయపడకుండా… వార్తలను.. వార్తల్లా ఇచ్చే న్యూస్ చానల్‌కు అనూహ్యమైన ఆదరణ వస్తుందని రవిప్రకాష్ అంచనా అని చెబుతున్నారు. ఆ వాక్యూమ్‌ని.. తన చానల్ భర్తీ చేస్తుందన్న నమ్మకంతో రవిప్రకాష్.. కొత్త చానల్ సన్నాహాలను ప్రారంభించారు.
టీవీ 9 చానళ్లన్నింటికీ కర్త, కర్మ, క్రియ రవిప్రకాషే..!
రవిప్రకాష్‌కు.. చానల్ లాంచ్ చేయడం అనేది పెద్ద విషయం కాదు. ఎందకంటే.. ఆయన తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా చానల్ ప్రారంభించిన మొట్టమొదటి వ్యక్తి. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా… అసాధ్యం అనుకున్న సమయంలో.. తన పట్టుదలతో.. టీవీ9 ప్రారంభించారు. ఆ తర్వాత ఆ చానళ్లను.. విస్తృత పరిచారు. ఉత్తరాదికి కూడా విస్తరించారు. టీవీకి ఉన్న కన్నడ, గుజరాతీ, ఇంగ్లిష్ , హిందీ లాంటి చానళ్లన్నీ… రవిప్రకాష్ చేతుల మీదుగానే ప్రారంభమయ్యాయి. ఆ చానళ్లన్నింటినీ రవిప్రకాషే.. దగ్గరుండి ఏర్పాట్లు చేసి ప్రారంభింపచేశారు. దాని వల్ల రవిప్రకాష్‌కు… చానల్ పెట్టడం అనేది.. పెద్ద విషయం కాకపోవచ్చనే అంచనా ఉంది.
మీడియా వాక్యూమ్‌ని రవిప్రకాష్ చానల్ భర్తీ చేస్తుందా..?
తెలుగు మీడియాలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు… ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు సహకరించడంలేదు. మీడియా సంస్థల యాజమాన్యాలకు.. వ్యాపార వ్యవహారాల లగేజీలు ఉండటంతో… వాటి కోసం.. మీడియా విలువలను కాపాడలేకపోతున్నారు. ప్రభుత్వానికి బాకా ఊదుతున్నారు. ప్రభుత్వాలు అక్రమాలకు పాల్పడుతున్నా.. ప్రశ్నించలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో.. ఎలాంటి వ్యాపార వ్యవహారాలు.. ఇతర లగేజీ లేని.. రవిప్రకాష్… చానల్‌ను.. దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతారనే అంచనా ఉంది. సహజంగా ఎవరికీ భయపడని వ్యక్తిత్వం కావడంతో.. రవిప్రకాష్ అడుగు సక్సెస్ అవుతుదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. త్వరలోనే రవిప్రకాష్ అండ్ టీం నుంచి.. చానల్ ప్రకటన వచ్చే అఅకాశం ఉంది.
టీవీ9లో సీనియర్లు రవిప్రకాష్ వెంటే..!?
ప్రస్తుతం టీవీ9కి పిల్లర్లుగా ఉన్న జర్నలిస్టులంతా.. రవిప్రకాష్ తో పాటు.. జర్నలిజంలో నడిచిన వారే. ఆయన నాయకత్వంలో ఎదిగినవారే. వారిలో చాలా మంది ఇప్పుడు కొత్త యాజమాన్యం పరిధిలో ఇమడలేకపోతున్నారని.. కానీ.. ఉన్న పళంగా ఉద్యోగాలను వదులుకోలేక.. అంతకంటే మంచి ఆఫర్లు.. ఇతర చోట్ల వచ్చే అవకాశం లేక.. అక్కడే కొనసాగుతున్నారని చెబుతున్నారు. ఇలాంటి వాళ్లంతా.. మళ్లీ రవిప్రకాష్‌తో పని చేసేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. రవిప్రకాష్ వర్కింగ్ స్టైల్‌కు వారంతా అలవాటుపడిపోయారు. అందుకే.. కొత్త చానల్ లాంచింగ్ చేస్తే.. తామంతా వస్తామని.. రవిప్రకాష్‌కు ఓ మాట చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. టీవీ9 అనే లోగో తప్ప.. మిగతా అంతా.. రవిప్రకాష్ చానల్ సేమ్ టు సేమ్ ఉండే అవకాశం ఉంది. కోర్టులో టీవీ9లోగో కూడా.. తనదేనని.. రవిప్రకాష్ వాదిస్తున్నారు. అది కూడా వస్తే.. ఎప్పట్లా.. టీవీ9 రవిప్రకాష్ అవుతారేమో..?