ప్రముఖ జర్నలిస్ట్, టీవీ9 సీఈఓ రవిప్రకాష్ రాజీనామా చేశారని, వేరే ఛానెల్లో చేరుతున్నారంటూ కొన్ని వెబ్‌సైట్స్ అదేపనిగా ప్రచారం చేశాయి. ఇటువంటి వదంతుల్ని పుకార్లను ప్రచారం చేసి జనాల్ని నెలరోజుల ముందునుంచే ‘ఏప్రిల్ ఫూల్స్’ చేస్తున్న పరిస్థితి. ఈ వార్తలో ఎటువంటి నిజంలేదని రూఢీగా తెలిసింది.
ఒక ఛానెల్ ఛైర్మన్‌తో రవిప్రకాష్ చేతులు కలిపారంటూ ఈ వెబ్‌సైట్స్ నిరాధార వార్తల్ని ప్రచురించి ప్రచారం చేస్తున్నాయి. అసలీవార్తల్లో ఎటువంటి నిజంలేదంటూ టీవీ9 వర్గాల్లో పేర్కొన్నాయి. దేశంలోనే అత్యధికస్థాయి, ప్రేక్షకాదరణ పొందిన టీవీ9 గ్రూప్ సృష్టికర్తగా రవిప్రకాష్ తనదైన ముద్ర వేసుకున్న సంగతి తెల్సిందే!