ఇది వరకు రవితేజ సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉండేది. ఇప్పుడు అలా కాదు. వరుస ఫ్లాపులు ఆయన మీద పడుతున్నాయి. ట్రాక్ ఎప్పుడో తప్పేశాడు. అయితే తన దగ్గరకు వచ్చే సినిమాలు మాత్రం తగ్గడం లేదు. దానికి తోడు రవితేజ పారితోషికం విషయంలో అస్సలు తగ్గడం లేదు. `ఇంత ఇస్తేనే చేస్తా..` అంటూ మొంకిపట్టు పడుతున్నాడని ఇండ్రస్ట్రీలో గుసగుసలు వినిపిస్తుంటాయి.
దానికి రవితేజ ధీటైన సమాధానం చెప్పాడు. నా స్థాయికి బట్టే పారితోషికం అందుకుంటున్నానని, ఎంత తీసుకోవాలో తనకు తెలుసని, నా జీతం 1000 రూపాయలు అయినప్పుడు 800 తీసుకోవడంలో అర్థం లేదని తేల్చేశాడు. ఓ సినిమా ఫ్లాప్ అయ్యాక, నిర్మాత పారితోషికం ఇస్తుంటే, ఆ చెక్కు చింపేసిన సందర్భాన్ని ఓ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు రవితేజ. అయితే హిట్టూ, ఫ్లాపులకు తనదే బాధ్యత అని, ఈ విషయంలో ఎవ్వరినీ నిందించడం లేదని చెప్పుకొచ్చాడు. రవితేజ నటించిన `డిస్కోరాజా` ఈనెల 24న విడుదల అవుతోంది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై రవితేజ గట్టి నమ్మకమే పెట్టుకున్నాడు.