రవితేజ సొంత బ్యానర్ ఆర్టీ టీం వర్క్స్. అయితే ఇప్పటివరకూ ఈ బ్యానర్ ఆయన సినిమాలకే పరిమితమైయింది. కేవం తను హీరోగా చేసిన సినిమాలకే నిర్మాణ భాగస్వామ్యం చేస్తున్నారు రవితేజ. ఇప్పుడు రాబోతున్న రావణాసుర అభిషేక్ నామా, రవితేజ ఇద్దరూ కలిసి నిర్మించారు. అయితే ఇప్పుడు సినిమాల నిర్మాణం విషయంలో మరో అడుగుముందుకు వస్తున్నారు రవితేజ. హీరో నానిని ఫాలో అవుతున్నారు. నాని కి సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా. ఆ బ్యానర్ లో వేరే హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నాడు నాని.
ఇప్పుడు రవితేజ కూడా అదే బాటలో వెళుతున్నారు. రవితేజ బ్యానర్ లో విశ్వక్ సేన్ హీరోగా ఒక సినిమా నిర్మించాలనే సన్నాహాలు జరుగుతున్నాయి. నిజానికి ఈ సినిమా కోసం అనుకున్న కథ రవితేజ కోసం ఓ దర్శకుడు రెడీ చేసుకున్నాడు. అయితే అది విశ్వక్ కి బావుంటుదని భావించిన రవితేజ.. కథని విశ్వక్ కి షిఫ్ట్ చేశారు. విశ్వక్ కి ఈ కథ బాగా నచ్చింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు వస్తాయి.