ఇటీవల ‘టైగర్ నాగేశ్వరరావు’లో గజదొంగగా కనిపించాడు రవితేజ. ఇప్పుడు మళ్లీ దొంగతనాలకు సిద్ధమైపోయాడు. రవితేజ కథానాయకుడిగా జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ‘దొంగ- పోలీస్’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో రవితేజ దొంగ. హీరోయిన్ పోలీస్. వీరిద్దరి మధ్యా జరిగే ప్రయాణమే ఈ కథ. అనుదీప్ కథలన్నీ సింపుల్ గా ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ మాత్రం పుష్కలంగా ఉంటుంది. అనుదీప్ కామెడీ టైమింగ్ కి, రవితేజ తోడైతే.. థియేటర్లు బ్లాస్ట్ అవ్వడం ఖాయం. అందుకే ఈ కాంబోపై జనాల్లో ఆసక్తి పెరిగింది. నిజానికి ఇప్పటికే ఈ సినిమా సెట్స్‌పై ఉండాల్సింది. కానీ స్క్రిప్టు విషయంలో అనుదీప్ రాజీ పడకపోవడంతో.. కాస్త ఆలస్యమైంది. ఈలోగా రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ పూర్తి చేస్తాడు. అతి త్వరలోనే `దొంగ – పోలీస్` సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతాన్ని అందిస్తారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.