రవితేజ – వి.ఐ ఆనంద్‌లో ‘డిస్కోరాజా’ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. కానీ బడ్జెట్ సమస్యల వల్ల ఓ అడుగు ముందుకేస్తే… నాలుగు అడుగులు వెనక్కి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనంద్ వేసిన బడ్జెట్‌కీ, రవితేజ మార్కెట్‌కీ అస్సలు పొంతన లేకపోవడం ‘డిస్కోరాజా’ ప్రధాన సమస్య. బడ్జెట్ తగ్గించడానికి విఐ ఆనంద్ చాలా రకాల ప్రయత్నాలు చేశాడు. స్టార్ హీరోయిన్లని పక్కన పెట్టి కొత్త హీరోయిన్లని తీసుకొచ్చాడు. సెట్లు వేసే అవసరం ఉన్నా – అవుడ్డోర్ షూటింగ్‌కి ఒప్పుకున్నాడు. ఇన్ని చేసినా బడ్జెట్ కంట్రోల్లో్ రావడం లేదు. దాంతో.. ఈ సినిమాని తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు సమాచారం. పాటల్ని కుదిస్తే కనీసం కోటి రూపాయలైనా బడ్జెట్ కంట్రోల్లోకి వస్తుందని ఆనంద్ భావిస్తున్నాడట. అయితే రవితేజ సినిమాల్లో పాటలు లేకపోతే ఎలా? అన్నది నిర్మాత భయం. కథ డిమాండ్ చేసినంత ఖర్చు పెట్టకపోతే క్వాలిటీ రాదన్నది దర్శకుడి అనుమానం. ఇలాంటి సమయంలో హీరోలు, సాంకేతిక నిపుణులు పారితోషికాలు తగ్గించుకోవడం ఒక్కటే మార్గం. కానీ రవితేజ అందుకు ఏమాత్రం అంగీకరించడం లేదని తెలుస్తోంది. మరి డిస్కో రాజాకి ఈ కష్టాలెప్పుడు తీరతాయో.. ఏమో..??