రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్ లో ‘వీర’ వచ్చింది. ఈ సినిమా యావరేజ్ దగ్గర ఆగిపోయింది. ఈ సినిమా తర్వాత దాదాపు ఎనిమిదేళ్ళు రమేష్ వర్మకి చెప్పుకోదగ్గ సినిమా లేదు. రాక్షసుడు రీమేక్ తో మళ్ళీ వెలుగులోకి వచ్చారు రమేష్ వర్మ. మళ్ళీ రవితేజతో ‘ఖిలాడీ’ సినిమా చేశారు. ఐతే ఈ సినిమా పూర్తిగా నిరాశ పరిచింది. అన్నీ కమర్షియల్ హంగులతో తెరకెక్కించిన ఖిలాడీకి పాస్ మార్కులు కూడా రాలేదు. అయితే రమేష్ వర్మపై రవితేజకి ఇంకా నమ్మకం పోలేదు. రవితేజ తమ్మడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రం భాధ్యతల రమేష్ వర్మకి అప్పగించారు రవితేజ. ప్రముఖ తారాగణం, మంచి టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు రమేష్ వర్మ అందిస్తున్నారు. ఒక కొత్త దర్శకుడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వుంది. దర్శకుడు ఎవరైనప్పటికీ మాధవ్ మొదటి సినిమా భాద్యత అంతా రమేష్ వర్మ పైనే పెట్టారు రవితేజ.