చిరంజీవి, బాబీ కాంబినేషన్లో వస్తున్న మెగా154 లో రవితేజ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ లో జాయిన్ అయ్యారు. తాజాగా రవితేజ ఎంట్రీపై చిత్ర యూనిట్ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో రవితేజ కారుపై సెట్లోకి రావడం, చిరంజీవిని విష్ చేయడం, తర్వాత ఎనర్జిటిక్ గా కారవాన్‌లోకి వెళ్ళడం అభిమానులని అలరించింది.
”అన్నయ్యా” అని రవితేజ పిలవగానే, చిరు రిప్లైగా ”హాయ్ బ్రదర్, వెల్కమ్ ”అని రవితేజ చేయి అందుకొని కారవాన్‌లోకి ఆహ్వానించడం మెగా మాస్ మూమెంట్ గా నిలిచింది. చివర్లో దర్శకుడు బాబీ “మెగా మాస్ కాంబో ఎంటర్ ” అంటూ మెగా మాస్ ఫ్యాన్స్ ని థ్రిల్ చేశారు. మాస్ తో పెట్టుకుంటే, శంకర్ దాదా ఎంబిబిఎస్ పాటలు మిక్స్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లో వాడటం కూడా బావుంది. ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న ఉత్సాహం రవితేజ ఎంట్రీతో రెట్టింపైయ్యింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా మెగా154 ప్రేక్షకుల ముందుకు రానుంది.