రవితేజ ఇటీవలే ‘మిస్టర్ బచ్చన్‌గా’ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఓ సినిమా చేస్తున్నారు. భాను భోగవరపు దర్శకుడు. ఈ చిత్రానికి ‘మాస్ జాతర’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో రవితేజ లక్ష్మణ్ భేరీ అనే పాత్రలో కనిపించబోతున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే కథ. శ్రీలీల కథానాయిక. 2025 సంక్రాంతికి విడుదల చేద్దామనుకొన్నారు. అయితే ఇటీవల రవితేజకు గాయమైంది. ఆపరేషన్ కూడా జరిగింది. దాంతో ఈ సినిమా ఆలస్యమైంది. ఇప్పుడు 2025 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
‘సామజవరగమన’ లాంటి హిట్ చిత్రాలకు రచయితగా పని చేశారు. భాను భోగవరపు. దర్శకుడిగా ఆయనకు ఇదే తొలి చిత్రం. భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘ధమాకా’ చిత్రంతో భీమ్స్ బిగ్ లీగ్ లో చేరిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాటలు మాస్కు బాగా కిక్ ఇచ్చాయి. ఈ సినిమాతో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవ్వబోతోందని చిత్రబృందం భావిస్తోంది. త్వరలోనే ‘మాస్ జాతర’ టైటిల్ ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.